AP: శ్రీకాకుళంలో డయేరియా కేసుల నమోదుపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. 32 మంది డయేరియా బారిన పడ్డారని, 10 మంది డిశ్చార్జి అయ్యారని అధికారులు తెలిపారు. 22 మంది పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో రహదారి మరమ్మతు పనుల వల్ల నీరు కలుషితమైందని ప్రాథమికంగా గుర్తించామని, డయేరియా బాధితుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని సీఎంకు అధికారులు వివరించారు.