AP: యోగా వారసత్వ సంపద అని, దీన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. యోగాతో ఆరోగ్యం, మానసిక వికాసం కలుగుతుందని చెప్పారు. ఈ ఏడాది కూడా యోగా దినోత్సవం నిర్వహిస్తామని, జూన్ 7 నుంచి 14 వరకు యోగా కార్యక్రమాలు చేపడతామని.. దీనిలో అందరినీ భాగస్వామ్యం చేస్తామని ప్రకటించారు.