TG: HYD కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ జరుగుతుంది. కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. స్టేడియంలో ఒక వరుసకు 21 టేబుళ్ల చొప్పున.. 2 వరుసల్లో 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండుకు 42 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన EVMల ఫలితం వెల్లడవుతుంది. 407 పోలింగ్ కేంద్రాల ఫలితాలు వెల్లడయ్యే వరకు 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు.