TG: రాష్ట్రంలో 1,365 గ్రూప్-3 సర్వీసుల పోస్టుల భర్తీకి 1:3 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులకు కమిషన్ ఇచ్చిన వెబ్ ఆప్షన్ల గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రాధాన్యత క్రమంలో పోస్టులు ఎంచుకోవచ్చు. వెబ్ ఆప్షన్ల అనంతరం ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించి, పోస్టింగులు ఇవ్వనుంది.