కెనడా ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కెనడా పార్లమెంట్లో మొత్తం 338 స్థానాలు ఉండగా.. వాటికి ఏప్రిల్ 28న ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.