TG: తాము పార్టీ మారలేదని, BRSలోనే కొనసాగుతున్నామని ఫిరాయింపు నోటీసులు అందుకున్న 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశానని.. ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండువా కప్పారన్నారు. అయితే పార్టీ మారిన MLAలపై వేటు వేయాలని BRS సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు కోర్టు సూచించిన విషయం తెలిసిందే.