AP: గోదావరి జలాలను అనకాపల్లి, విశాఖ జిల్లాలకు తీసుకువస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే, పోలవరం ప్రాజెక్టును 2027కు పూర్తి చేసి గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామన్నారు. విశాఖకు అద్భుతమైన కనెక్టివిటీ ఉందని, పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్తామన్నారు.