భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన ప్రకటన చేశారు. ద్విముఖ యుద్ధానికి (Two-front War) తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. భారత్ ‘డర్టీ గేమ్స్’ ఆడుతోందని ఆరోపించారు. ‘టూ-ఫ్రంట్ వార్’ కోసం తమ వద్ద వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయని, అయితే వాటిని బహిరంగంగా చర్చించబోమని ఆసిఫ్ స్పష్టం చేశారు.