TG: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఆలయ విస్తరణ పనుల కోసం దర్శనాలు నిలిపివేస్తామని నిన్న అధికారులు ప్రకటించారు. ఆలయ అధికారుల ప్రకటనతో భక్తులు ఆయోమయానికి గురయ్యారు. అయితే, దర్శనాలు నిలిపివేయాలా? లేదా అనే విషయంపై మరో రెండు రోజుల్లో స్పష్టత ఇస్తామని తెలిపారు.