TG: సింగరేణిలో రూ.15 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, సంస్థ కుంభకోణాలమయంగా మారిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. వారసత్వ ఉద్యోగాల హామీపై కార్మికుల పక్షాన ప్రశ్నించినందుకే తనపై అక్రమ సెక్షన్లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని, అయినా మోసాలను ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.