భారత తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. మరో వైపు తన నాయకత్వ పటిమతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లారంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.