కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్లో మరో విభజన అనివార్యంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ‘MMC’గా మారిందని, అంటే ‘ముస్లిం మావోయిస్టు కాంగ్రెస్’ అని ఆయన నిర్వచించారు. కాంగ్రెస్ ఇతర పార్టీలను కూడా ముంచేస్తోందని, వాటి ఓట్లతో బతకాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.