TG: శాసనసభ సమావేశాల నేపథ్యంలో సభలో సీపీఐ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. కౌలు రైతులకు రైతుబంధు పథకం అమలు చేయాలని తీర్మానంలో పేర్కొంది. కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు చేసి శాశ్వత పట్టాలు ఇవ్వాలని తెలిపింది. సీతారామచంద్రస్వామి భూముల్లో సాగు చేసే కౌలు రైతులపై ఆ పార్టీ సభ్యులు తీర్మానం ఇచ్చారు.