జమిలి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. ముమ్మాటికి ఇది రాజ్యాంగ విరుద్ధమని, భారత ప్రజాస్వామ్యాన్ని, సమగ్రతను నాశనం చేయటంలో భాగంగానే ఈ నిర్ణయాన్ని కేంద్రం తీసుకుందని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా టీఎంపీ ఎంపీలు ఓటు వేస్తారని చెప్పారు. ఢిల్లీ నియంతృత్వానికి బెంగాల్ ఎన్నటికి తలొగ్గదని వెల్లడించారు.