AP: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ని కలిశారు. అయోధ్య, వారణాసి పుణ్యక్షేత్రాల్లో తెలుగు సమాచార కేంద్రాల ఏర్పాటు చేయాలని కోరారు. భక్తుల వసతి, భోజన సౌకర్యాల భవనం కోసం ప్రభుత్వ భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం యోగికి వినతిపత్రం అందజేశారు.