TG: హైదరాబాద్‌లో మోమోస్ తయారు చేసిన సంస్థను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఒకరి మృతికి కారణమైన మోమోస్.. చింతల బస్తీలో తయారు చేసినట్లు గుర్తించి శాంపిల్స్ సేకరించారు. ఆ సంస్థకు ఎలాంటి అనుమతులు లేనట్లు అధికారులు తేల్చి చెప్పారు. కాగా.. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.