AP: అయినవిల్లి యువకుడి హత్య విషయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలను మాజీమంత్రి పినిపె విశ్వరూప్ ఖండించారు. ఈ కేసులో తన కుమారుడికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కేసును త్వరగా పూర్తి చేయాలని ఎస్పీకి చెప్పానని తెలిపారు. కాగా.. దళిత యువకుడు, వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో మాజీమంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.