TG: రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణను మూడేళ్లపాటు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ NICతో ఒప్పందం కుదుర్చుకుంది. NIC పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగిస్తామని ఒప్పందంలో వెల్లడించింది. ధరణి పోర్టల్ నిర్వహణను ప్రైవేట్ సంస్థ టెరాసిస్ నుంచి ఎన్ఐసీకి బదలాయింపు చేశారు. సాంకేతిక అంశాల్లో ఎన్ఐసీకి సహకరించాలని టెరాసిస్ను ప్రభుత్వం కోరింది. వచ్చే నెలాఖరు వరకు టెరాసిస్కు గడువు ఇచ్చింది.