ముడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. మరిన్ని చిక్కులు ఎదుర్కోనున్నారు. ఈ కేసులో లోకాయుక్త విచారణ చేయాలని బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ చేపట్టి మూడు నెలల్లో నివేదిక అందించాలని సూచించింది. మరోవైపు ఇదే ముడా స్కామ్ కేసులో ఇరుక్కున్న సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.