ఢిల్లీకి ఇవాళ మంత్రి సీతక్క వెళ్లనున్నారు. పెసా చట్టంపై జరిగే జాతీయ సదస్సుల్లో ఆమె పాల్గొంటారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పెసా చట్టంపై జాతీయ సదస్సు జరుగనుంది. తెలంగాణ నుంచి మంత్రి సీతక్క హాజరవుతున్నారు. ఆదివాసీ, గిరిజనుల అభివృద్ది, పెసా చట్ట అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, పరిష్కార మార్గాలపై ప్రసంగించనున్నారు.