తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తోమాల, అర్చన సేవల్లో పాల్గొని శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు గవర్నర్కు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించారు. అలాగే, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.