»What Happens Voter Presses The Evm Voting Button More Than One Time
EVM : ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈవీఎం బటన్ నొక్కితే ఏం అవుతుంది?
ఈవీఎం బటన్లను ఒకసారి కంటే ఎక్కువ నొక్కితే ఏమవుతుంది? ఖాళీ బటన్లను నొక్కితే ఓటు చెల్లుబాటు కాదా? లాంటి ఎన్నో సందేహాలకు ఇక్కడ సమాధానాలు ఉన్నాయి. చదివేయండి.
EVM VOTING : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈవీఎం యంత్రాలపై అందరికీ ఎన్నో అనుమానాలు ఉంటాయి? ఈవీఎం మిషన్లపై చాలా బటన్లు ఉంటాయి కదా. వాటిని ఒకసారి కంటే ఎక్కువ నొక్కితే ఏమవుతుంది? ఒక దాని తర్వాత ఇంకోటి నొక్కితే ఏమవుతుంది? గుర్తు లేని ఖాళీ బటన్లు (BUTTONS)) నొక్కితే ఏమవుతుంది? లాంటి అనేక సందేహాలకు సమాధానాలు ఇక్కడున్నాయి.
పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన తర్వాత ఈవీఎంలో(EVM) పార్టీ గుర్తులతో కూడిన బటన్లు వరుసగా ఉంటాయి. వాటిలో ముందు నొక్కిన బటన్‌తో మన ఓటు లాక్ అవుతుంది. ఆ తర్వాత ఎన్ని బటన్లు నొక్కినా దాని వల్ల ఎక్కువ ఓట్లు పోలయ్యే అవకాశాల్లాంటివి ఏమీ ఉండవు. అలాగే ఖాళీ బటన్లు లాక్‌లో ఉంటాయి. వాటిని నొక్కడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. కాబట్టి ఎవరైనా ముందు నొక్కే బటన్ కీలకం. దాన్ని నొక్కగానే మిషన్ లాక్ అవుతుంది. తర్వాత ఏం నొక్కినా ప్రయోజనం ఉండదు.
సాధారణంగా ఒక్కో ఈవీఎం మిషన్‌లోనూ 16 బటన్లు(BUTTONS) ఉంటాయి. 16 మంది వరకు అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు ఒకే ఈవీఎంని ఉపయోగిస్తారు. ఒక్కోసారి అక్కడ ఐదుగురే పోటీలో ఉన్నారనుకుందాం. అప్పుడు ఐదు బటన్లకే గుర్తులు ఉంటాయి. ఒక నోటా బటన్ ఉంటుంది. మిగిలిన బటన్లు ఖాళీగా ఉంటాయి. అవి పని చేయకుండా ఉండేలా రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకున్నారు. అవి పని చేయకుండా లాక్ చేస్తారు. దీంతో ఓట్లు వృధాగా వాటిలో పడవు.