»We Cant Control Polls Supreme Court To Prashant Bhushan In Vvpat Case
Supreme Court : ఈవీఎం కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)తో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ద్వారా పోలైన ఓట్లను పూర్తి స్థాయిలో ధృవీకరించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
Supreme Court: Conduct of elections should be sacred
Supreme Court : పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)తో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ద్వారా పోలైన ఓట్లను పూర్తి స్థాయిలో ధృవీకరించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఎన్నికలను నియంత్రించే అధికారం తమది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధమైన అధికార సంస్థ ఎన్నికల సంఘం పనితీరును నిర్దేశించలేమని సుప్రీం పేర్కొంది. వీవీ ప్యాట్ సిస్టమ్ ద్వారా రూపొందించని పేపర్ స్లిప్‌లతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లో పోలైన ఓట్లను క్షుణ్ణంగా క్రాస్ చెక్ చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతానికి ఈ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుకు సంబంధించిన కొన్ని అంశాలపై సుప్రీంకోర్టు బుధవారం ఎన్నికల కమిషన్‌ను వివరణ కోరింది. మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల సంఘం ఉన్నతాధికారిని కూడా పిలిపించింది. కోర్టు ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ఎన్నికల సంఘం సీనియర్ అధికారి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఈవీఎంలపై తరచుగా అడిగే ప్రశ్నలకు (FAQలు) సంబంధించి ఎన్నికల సంఘం ఇచ్చిన సమాధానాల్లో కొంత గందరగోళం ఉన్నందున కొన్ని అంశాలపై స్పష్టత అవసరమని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ లేవనెత్తిన ఆందోళనలపై కోర్టు స్పందించింది. ఈవీఎంలపై ఆరోపణలు రావడంతో, ఈవీఎంలో నమోదైన ప్రతీ ఓటును వీవీప్యాట్ పేపర్ స్లిప్‌లతో క్రాస్ వెరిఫై చేయాలని పిటిషన్లు నమోదయ్యాయి. ఈవీఎంలో రెండు యూనిట్లు ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్ మరొకటి బ్యాలెట్ యూనిట్. ఇవి కేబుల్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. ఈ రెండు మిషన్లు వీవీపాట్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. మనం వేసిన ఓటు వేయగానే ఎవరికి ఓటు వెళ్లిందనే విషయం వీవీప్యాట్ స్లిప్ ద్వారా మనకు తెలుస్తుంది. దీంతో ఓటర్‌కి నమ్మకం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ వీవీ ప్యాట్ ద్వారా వచ్చే పేపర్ స్లిప్‌లతో బ్యాలెట్లో నమోదైన ఓట్లు మొత్తాన్ని క్రాస్ చెక్ చేయాలని కొంతమంది కోరుతున్నారు.