»Pushpa 2 Pushpa 2 First Single Date Fix But Is This Promo Pushparaj
Pushpa 2: ‘పుష్ప2’ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్.. కానీ ఇదేం ప్రోమో పుష్పరాజ్?
పుష్ప పార్ట్ 1 సినిమాకు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే.. పుష్ప2 ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. అందుకు తగ్గట్టే.. ఫస్ట్ సింగిల్ ప్రోమో ఉంది. కానీ నిడివి మాత్రం దారుణంగా ఉందనే చెప్పాలి.
Pushpa 2: 'Pushpa 2' First Single Date Fix.. But Is This Promo Pushparaj?
Pushpa 2: వెయ్యి కోట్ల సినిమా నుంచి వస్తున్న ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందా? అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న అభిమానులకు.. జస్ట్ ప్రోమోతోనే హైప్ ఎక్కించాడు దేవిశ్రీ ప్రసాద్. సడెన్ సర్ప్రైజ్ ఇస్తూ.. పుష్ప2 నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నామని చెప్పిన మేకర్స్.. లేటెస్ట్గా ఆ ప్రోమోని రిలీజ్ చేశారు. ఊహించినట్టుగానే ఈ ప్రోమో అదిరిపోయింది. పుష్ప.. పుష్ప.. అంటూ స్టార్ట్ అయిన ఈ ప్రోమో.. పుష్పరాజ్ అని వచ్చేసరికి మాస్ డ్యాన్స్‌కు శాంపిల్‌గా ఉంది. ఈ ప్రోమో చూస్తే విజువల్ గ్రాండియర్‌గా ఉంటుందనే చెప్పాలి.
ఎప్పటి లాగే బన్నీ వేలికి ఉన్న ఉంగరాలను, రెడ్ కలర్ చిటికెన వేలిని ఈ ప్రోమోలో హైలెట్ చేశారు. సినిమాలో టైటిల్ అండ్ బన్నీ ఇంట్రడక్షన్ సాంగ్‌గా ఇది ఉండనుంది. అయితే.. ప్రోమో అని చెప్పిన మేకర్స్ కనీసం 20 సెకన్లు కూడా కట్ చేయలేదు. సాధరణంగా ఏ ప్రోమో తీసుకున్న కనీసం 30 సెకన్లు అయినా ఉంటుంది. కానీ ఈ ప్రోమో 20 సెకన్ల లోపే ఉంది. ఇక ఈ ఫుల్ సాంగ్‌ని మే 1వ తేదిన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక పుష్ప పార్ట్ 1 సినిమా దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే.. పుష్ప2 ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి.
అందుకు తగ్గట్టే.. ఫస్ట్ సింగిల్ ఉండబోతోందనే చెప్పాలి. ఇప్పటికే రిలీజ్ చేసిన పుష్ప2 టీజర్‌కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఫస్ట్ సాంగ్ కూడా క్లిక్కయితే అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోతాయి. ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో ఫస్ట్ సాంగ్ బయటికి రాబోతోంది కాబట్టి.. మిగతా సాంగ్స్ ఎలా ఉంటాయనేది ఎగ్జైటింగ్‌గా మారింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది.