»Water Crisis Forces Maharashtra Villagers To Descend Into Well
Viral Video: నీటి కోసం పాట్లు..బావి లోనికి మహిళలు
మహారాష్ట్రలో గల నాసిక్‌లో నీటి కోసం జనం ఇబ్బంది పడుతున్నారు. చుక్క నీటి కోసం ఓ మహిళ బావిలో దిగుతోన్న వీడియో ట్రోల్ అవుతుంది. సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
Water Crisis Forces Maharashtra Villagers To Descend Into Well
Water Crisis: ఎండకాలం వచ్చిందంటే చాలు.. నీటి (water) సమస్య ఉండనే ఉంటుంది. ఈ సారి ఏప్రిల్‌లో కొన్నిసార్లు వర్షాలు పడటంతో.. మే నెలలో ఎండ ప్రభావం కనిపిస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్, రాయ్‌గఢ్, ఔరంగబాద్ జిల్లాల్లో నీటి కొరత ఉంది. చుక్క నీటి కోసం అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నాసిక్‌లో (nasik) గల కోషింపాడా గ్రామంలో జనం నీటి కోసం పాట్లు పడుతున్నారు. ఊరిలో అందరు ఓకే బావి మీద ఆధారపడ్డారు. అక్కడికి రావాలంటే ఓ కిలోమీటర్ దూరం నడాల్సిందే.. పని వదులుకొని నీటి కోసం వస్తున్నారు. ఆ బావి లోతులో ఉండటం.. బిందెడు నీటి కోసం పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.
ఆ కొంత నీరు (water) కూడా తమకు దొరకదేమోనని కొందరు మహిళలు (womens) భావిస్తున్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి, బావిలోపలికి దిగుతున్నారు. నీటిని సేకరిస్తూ.. వస్తున్నారు. బావిలో దిగే సమయంలో ఏకాస్త ఏమరపాటు కనబరిచినా అంతే సంగతులు. ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. ఇంత కష్టపడ్డ.. అక్కడ వారికి దొరికే నీరు.. రంగు మారి ఉంది. ఆ నీటి కోసం జనం ప్రాణాలను లెక్కచేయక దిగుతున్నారు. రాయ్ గఢ్, ఔరంగబాద్ జిల్లాల్లో కూడా నీటి కొరత ఉంది. ఆ జిల్లాల్లో ప్రజలు కూడా నీటి కోసం అల్లాడి పోతున్నారు.
వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, వర్షాభావం వల్ల నీటి సమస్య (water problem) ఏర్పడుతుంది. చెట్లను నరకొద్దని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నప్పటికీ.. కొన్నిచోట్ల నరికివేత కొనసాగుతూనే ఉంది. జల్ జీవన్ మిషన్ (jal jeevan mission) కింద ప్రతీ గ్రామానికి నీరు అందిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం (maharashtra government) చెబుతోంది. ఈ మేరకు చర్యలు ప్రారంభించామని మంత్రి విజయ్ కుమార్ కృష్ణారావు గవిట్ (vijay kumar krishna rao) తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ- ఏక్ నాథ్ షిండే శివసేన ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.
#WATCH | Maharashtra: Due to the water crisis, people of Koshimpada Village are compelled to consume; descent into a well to fetch water pic.twitter.com/6orDLsCpyQ