Video Viral : యాంటీ స్లీప్ అలారం కనిపెట్టిన విద్యార్థులు!
రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఐదుగురు విద్యార్థులు యాంటీ స్లీప్ అలారమ్ సిస్టమ్ పరికరాన్ని తయారు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అధికారులు ట్రాఫిక్ రూల్స్(Trafic Rules) ఎన్ని తీసుకొచ్చినా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం రోడ్డు ప్రమాదాలు(Road Accidents) ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కువ ప్రమాదాలు నిద్ర మత్తులోనే జరుగుతున్నాయి. తాజాగా డ్రైవర్ నిద్రలోకి జారుకుంటే అలర్ట్ చేసే పరికరాన్ని(Anti sleep alarm) విద్యార్థులు రెడీ చేశారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఇండోర్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు కలిసి యాంటీ స్లీప్ అలర్ట్ సిస్టమ్(Anti sleep Alert System)ను తయారు చేశారు.
ప్రయాణ సమయంలో డ్రైవర్ నిద్రలోకి జారకుంటే ఆ పరికరం(Anti sleep Alert System) నుంచి శబ్దం వస్తుంది. దీంతో డ్రైవర్ అలర్ట్ అవుతారు. అంతేకాకుండా డ్రైవర్ నిద్రలోకి జారుకుంటూ ఉంటే వెంటనే వాహనాన్ని కూడా ఈ సిస్టమ్ ఆపేస్తుంది. దీనిపై మరింత ప్రయోగాలు జరుగుతున్నాయని, ఈ పరికరం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాదాలు(Road Accidents) చాలా వరకూ తగ్గుతాయని విద్యార్థులు తెలుపుతున్నారు.
డ్రైవర్ కళ్లు మూసుకోగానే పరికరంలోని సెన్సార్ సిస్టమ్ అలారాన్ని మోగిస్తుంది. వెంటనే బజర్ మోగితే డ్రైవర్ కళ్లు మూసుకోగానే కారు చక్రం కూడా ఆగిపోతుంది. ఈ టెక్నాలజీ ఇంత వరకూ రాలేదు. ఈ అలారాన్ని(Anti sleep Alert System) డ్రైవర్లతో పాటుగా పెద్ద వాహనాల్లో ప్రయాణించే వారి ప్రాణాలను కూడా కాపాడుతుంది.
యాంటీ స్టీప్ అలారాన్ని(Anti sleep Alert System) కనిపెట్టడానికి ఐదుగురు విద్యార్థులు మూడు రోజుల వారాల పాటు కష్టపడ్డారు. విద్యార్థులు తయారు చేసిన ఈ అలారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. ఈ పరికరం పూర్తి స్థాయిలో వాడుకలోకి వస్తే ఎన్నో ప్రమాదాలను నివారిస్తుంది. చాలా మంది ప్రాణాలు పోకుండా కాపాడుతుంది.