»Video Clip Played At Patna Railway Station For 3 Mins
Patna railway station: రైల్వే స్టేషన్లో 3 నిమిషాలు పోర్న్ వీడియో
పాట్నా రైల్వే స్టేషన్ లో (Patna railway station) పది ప్లాట్ ఫామ్ లు ఉన్నాయి. ఈ ప్లాట్ ఫామ్ ల పైన వందలాది మంది ప్రయాణీకులు తమ ఎక్కవలసిన రైళ్ల కోసం వేచి (Waiting for Train) చూస్తున్నారు. కొంతమంది ఏమీ తోచక టీవీ చూస్తున్నారు. అలా చూస్తుండగా... హఠాత్తుగా టీవీ తెర పైన పోర్న్ వీడియో (Video) వచ్చింది.
పాట్నా రైల్వే స్టేషన్ లో (Patna railway station) చాలామంది అలా టీవీ వైపు చూస్తూ ఉండిపోయారు. టీవీలో వస్తున్న పాటలు లేదా ఇతర కార్యక్రమాలను చూస్తున్న ప్రయాణీకులు.. హఠాత్తుగా తెర పైన ప్రత్యక్షమైన దానిని చూసి ఆశ్చర్యపోయారు. మహిళలు, పెద్దవారు తలలు కిందికి వేశారు. టీవీని చూడకుండా ఫోన్ లలో ముగిని తేలిన వారు, ఇతరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతున్న వారు కూడా హఠాత్తుగా టీవీ తెర పైన ప్లే అవుతున్న దానిని చూసి షాక్ అయ్యారు.
పాట్నా రైల్వే స్టేషన్ లో (Patna railway station) పది ప్లాట్ ఫామ్ లు ఉన్నాయి. ఈ ప్లాట్ ఫామ్ ల పైన వందలాది మంది ప్రయాణీకులు తమ ఎక్కవలసిన రైళ్ల కోసం వేచి (Waiting for Train) చూస్తున్నారు. కొంతమంది ఏమీ తోచక టీవీ చూస్తున్నారు. అలా చూస్తుండగా… హఠాత్తుగా టీవీ తెర పైన పోర్న్ వీడియో (Video) వచ్చింది. పది ప్లాట్ ఫామ్ లలోను టీవీలు ఉన్నాయి. అన్నింటా మూడు నిమిషాల పాటు ఆ పోర్న్ వీడియో టెలికాస్ట్ అయింది. ఈ సంఘటన ఆదివారం రోజు రాత్రి జరిగింది.
ఇక్కడి రైల్వే స్టేషన్ లలో టీవీలలో వీడియోలు, ఫిలిమ్స్ టెలికాస్ట్ చేసే కాంట్రాక్ట్ ను ఓ ప్రయివేటు కంపెనీకి ఇచ్చింది స్థానిక దానాపూర్ డివిజన్ (Danapur division). ఈ విషయం తెలియగానే రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (RPF) అధికారులు వెంటనే సంబంధిత కంపెనీకి ఫోన్ చేసి, పోర్న్ వీడియో టెలికాస్టింగ్ ను నిలిపివేయించారు. తాము ఈ ఘటన పైన విచారణ జరిపి, కంపెనీతో కాంట్రాక్ట్ ను క్యాన్సిల్ చేసుకుంటామని, దీనికి సంబంధించి కేసు బుక్ అయిందని DRM ఆఫీస్ అధికార ప్రతినిధి ప్రభాత్ కుమార్ తెలిపారు. ఇది ఏమాత్రం క్షమించరాని నేరం అన్నారు. ఈ కంపెనీని తాము బ్లాక్ లిస్ట్ లో పెడతామని స్పష్టం చేశారు. ఇదే రైల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం కూడా ఇలాంటి సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.