»Tmc Mp Mahua Moitra Who Took Money To Ask Questions In Parliament
Mahua moitra: ప్రశ్నలడింగేందుకు డబ్బులు తీసుకున్న TMC ఎంపీ మహువా మొయిత్రా?
దేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన పార్లమెంటులో ప్రశ్నలు అడిగితే కూడా డబ్బులు ఇస్తారా? అంటే అస్సలు ఛాన్స్ లేదని అంటారు రాజకీయ నిపుణులు. కానీ ఓ ఎంపీ మాత్రం డబ్బుల కోసమే ప్రశ్నలు అడిగారనే ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
TMC MP Mahua moitra who took money to ask questions in parliament
తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా(Mahua moitra) సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఒక ప్రముఖ వ్యాపారవేత్త నుంచి డబ్బులు, బహుమతుల కోసమే ఆమె పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. అంతేకాదు ఆమె అడిగిన 61 ప్రశ్నల్లో 50 అదానీ గ్రూపుపై ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు స్పీకర్‌కు తన లేఖలో దూబే పేర్కొని…ఆ TMC MP తరచుగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించి ఆమైపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో మొయిత్రాను సభ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని దూబే డిమాండ్ చేశారు. ఆమెపై వచ్చిన ఆరోపణలను పరిశీలించడానికి “విచారణ కమిటీ”ని ఏర్పాటు చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను తెలిపారు. రియల్ ఎస్టేట్ గ్రూప్ హీరానందానీ గ్రూప్ CEO అయిన మోయిత్రా.. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి పెద్ద ఎత్తున నగదు తనకు అందిందని దూబే తన లేఖలో పేర్కొన్నారు.
అయితే తనపై వచ్చిన అభియోగాలు తన పరువు నష్టం కలిగించేవని మొయిత్రా అన్నారు. అవన్నీ తప్పుడువని, నిరాధారమైనవి, సాక్ష్యం లేకుండా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. మహువా మొయిత్రా ఎల్లప్పుడూ లోక్‌సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రశ్నలు సంధిస్తుంది. సభలో ఆమె చేసిన ప్రసంగాలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. మహువా నైపుణ్యం కలిగిన వక్తగా, అద్భుతమైన నాయకురాలిగా పేరుపొందారు. అయితే మహువా రాజకీయాల్లోకి రాకముందు విజయవంతమైన బ్యాంకర్ అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
మహువా మొయిత్రా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్(bengal)లోని కృష్ణానగర్ స్థానం నుంచి TMC టిక్కెట్‌పై గెలిచారు. మహువా 1974లో అస్సాంలోని కాచర్ జిల్లాలో జన్మించారు. మహువా రాజధాని కోల్‌కతాలో చదువుకున్నారు. ప్రాథమిక విద్యను అభ్యసించిన తరువాత, మహువాను తదుపరి చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. 1998లో మసాచుసెట్స్‌లోని మౌంట్ హోలియోక్ కాలేజ్ సౌత్ హ్యాడ్లీ నుంచి ఎకనామిక్స్, మ్యాథ్స్‌లో పట్టా అందుకున్నారు. మహువా మొయిత్రా డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రోసెన్ను వివాహం చేసుకున్నారు. కానీ ఈ వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇద్దరూ ఒకరికొకరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మహువా ఢిల్లీలో ఒంటరిగా నివసిస్తున్నారు.
చదువు పూర్తయిన తర్వాత మహువా ప్రతిష్టాత్మక బ్యాంకింగ్ కంపెనీ JP మోర్గాన్ చేజ్లో పనిచేశారు. ఆ తర్వాత న్యూయార్క్, లండన్ రెండు చోట్ల పనిచేశారు. అక్కడ ఆమె కోటి రూపాయల జీతంతో పనిచేసేదని తెలుస్తోంది. JP మోర్గాన్‌లో పనిచేస్తున్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సగటు జీతం 1.21 లక్షల డాలర్ల కంటే ఎక్కువ. అయితే మహువాకు ఫారిన్లో పని చేయడం నచ్చలేదు. దీంతో రాజకీయాల్లో భాగమై ప్రజలకు సేవ చేయాలనుకుంది. అందుకే భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకుని ఆమె 2009లో వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఏడాదిలోపే ఆమె కాంగ్రెస్‌పై విరక్తి చెంది.. 2010లో టీఎంసీలో చేరారు. TMCలో చేరిన తర్వాత ఆమె రాజకీయ కెరీర్(political career) గ్రాఫ్ క్రమంగా పైకి ఎగబాకడం ప్రారంభించింది.