సాధారణంగా సినిమా పెళ్లి సీన్ల(Wedding scenes)లో సరిగ్గా మూడు ముళ్లు వేసే సమయానికి ఆపండి అనే డైలాగ్ వింటూం ప్రస్తుతం సేమ్ అదే ఇలాంటి డైలాగే కేరళ రాష్ట్రం (Kerala State) లోని ఓ కళ్యాణ మండపంలో వినిపించింది. వధువు మెడలో వరుడు తాళికట్టడానికి కొద్ది క్షణాల ముందు మండపంలోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు(police)… వధువును బలవంతంగా పీటలపై నుంచి లాక్కెళ్లి కోర్టుకు తీసుకెళ్లారు. ఇంతకీ ఆ పెళ్లిని పోలీసులు ఎందుకు ఆపారు? అసలేం జరిగిందో తెలుసుకుందాం… అలప్పుజ జిల్లాలోని కోవలం ప్రాంతానికి చెందిన అల్ఫియా(Alfia), అఖిల్ గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి మతాలు వేరు కావడంతో.. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఇద్దరు.. స్థానిక ఆలయంలో వివాహం (marriage) చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఇక వరుడు వధువు మెడలో తాళి కట్టేందుకు సిద్ధమయ్యాడు. సరిగ్గా ఇదే సమయానికి పోలీసులు అక్కడ వాలిపోయి వధువును బలవంతంగా తీసుకెళ్లారు. ఆమెను పోలీసు స్టేషన్(Police station)కు తరలించారు పోలీసులు. అనంతరం అల్ఫియాను కోర్టులో హాజరుపరిచారు. మేజర్ అయిన తాను అఖిల్(Akhil)తోనే ఉంటానని చెప్పడంతో కోర్టు అందుకు అంగీకరించింది. దీంతో ఇద్దరు ప్రేమికులు కోర్టు నుంచి వెళ్లిపోయారు. మళ్లీ మంగళవారం పెళ్లి చేసుకునేందుకు అల్ఫియా, అఖిల్ సిద్ధమయ్యారు. అయితే అల్ఫియా అదృశ్యమైందని వారు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతోనే.. ఆమెను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రవర్తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు అఖిల్ తెలిపాడు.