»The Historical Symbol In The New Parliament Building Is The Scepter
New Parliament : నూతన పార్లమెంటులో భవనంలో చారిత్రక చిహ్నం రాజదండం..
పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్షానికి చెందిన 19 పార్టీలు ప్రకటించాయి. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ (PM MODI) ఈ నెల 28న ప్రారంభించనున్నారు.
కొత్త పార్లమెంట్ (New Parliament) భవనంలో బంగారు రాజదండాన్నిలోపల స్పీకర్ కుర్చీ సమీపంలో ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. రాజదండాన్ని సెంగోల్ అంటారు. తమిళ పదమైన సెమ్మాయ్ (Semmay) (ధర్మం) నుంచి ఈ పదం వచ్చింది. 1947లో మనకు స్వాతంత్రర్యం వచ్చిందనే సంగతి తెలిసిందే. అంటే బ్రిటీష్ (British) వారి నుంచి మనకు అధికార బదిలీ జరిగింది. అప్పటి బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటెన్ (Lord Mountbatten) అధికార బదిలీకి అంగీకరించిన తర్వాత దీనికి గుర్తుగా ఏదైనా చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని భావించారు. తమిళ సంప్రదాయంలో రాజుల కాలంలో అధికార బదిలీ సందర్భంగా పాటించే ఒక విధానం గురించి ఆయన నెహ్రూకు చెప్పారు. కొత్త రాజు బాధ్యతలు చేపట్టే సమయంలో ప్రధాన పూజారి ఆ రాజుకు రాజదండం అందజేసే సంప్రదాయం ఉందని చెప్పారు.
దీనికి అంగీకరించిన పీఠాధిపతులు మద్రాసు(Madras) లో నిపుణులైన స్వర్ణకారులతో బంగారంతో రాజదండాన్ని తయారు చేయించారు. దీని పొడవు ఐదు అడుగులు ఉంటుంది. ఈ రాజదండం పై భాగంలో నంది చిహ్నం ఉంటుంది. దీన్ని న్యాయానికి చిహ్నంగా ఏర్పాటు చేశారు. ఈ రాజదండాన్ని తయారు చేయించిన పీఠాధిపతులు తర్వాత దాన్ని లార్డ్ మౌంట్ బాటెన్కు అప్పగించారు. తర్వాత ఆయన దగ్గరి నుంచి వెనక్కి తీసుకున్నారు. అనంతరం గంగా జలం(Ganga water)తో శుద్ధి చేయించి, ఊరేగింపుగా భారత నూతన ప్రధాని నెహ్రూ వద్దకు తీసుకెళ్లారు. భారత స్వాతంత్ర్య ప్రకటన వెలువడటానికి 15 నిమిషాల ముందు ఈ రాజదండాన్ని ఆయనకు అందజేశారు. బ్రిటీషర్ల నుంచి ఇండియాకు అధికారం బదిలీ అయిందని చెప్పడానికి గుర్తుగా దీన్ని అందించారు. నూతన పార్లమెంట్ భవనం ఈ నెల 28, వచ్చే ఆదివారం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ (PM MODI) ఈ భవనాన్ని ప్రారంభించబోతున్నారు