VSP: జిల్లాలో దాబా గార్డెన్స్ ప్రాంతంలో విద్యుత్ వైర్లకు, స్తంభాలకు దట్టంగా అల్లుకున్న తీగలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్డు పక్కన ఉన్న చెట్లకు సంబంధించిన తీగలు అడ్డదిడ్డంగా విద్యుత్ వైర్ల మీదుగా విస్తరించాయి. ఇవి కేవలం విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగించడమే కాకుండా, ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు.