CTR: పుంగనూరు గ్రామ దేవత మారెమ్మ ఆలయంలో ఆషాడ మాసం తొలి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. వేకువజాము నుంచి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.