TG: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు భారీగా నమోదయ్యాయి. ఈ నెలలో ఏకంగా 3,353 మంది వాహనదారులు మద్యం తాగి పట్టుబడ్డారు. పాత కేసులతో కలిపి మొత్తం 5,321 ఛార్జ్షీట్లను పోలీసులు దాఖలు చేశారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 133 మందికి జైలు శిక్ష పడగా, కోర్టు రూ.14,87,600 జరిమానా విధించింది.