»Student Sets Principal On Fire At Indores Pharmacy College
Student sets principal on fire:ప్రిన్సిపల్‌కు నిప్పంటించిన విద్యార్థి.. కారణమిదే?
Student sets principal on fire:మధ్యప్రదేశ్ ఇండోర్‌లో దారుణం జరిగింది. బీఎం కాలేజీ ప్రిన్సిపల్‌పై (principal) విద్యార్థి (student) నిప్పు అంటించారు. తన మార్కుల సీట్ (marks sheet) ఇవ్వడం ఆలస్యం చేస్తున్నారని ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Student sets principal on fire:మధ్యప్రదేశ్ ఇండోర్‌లో దారుణం జరిగింది. బీఎం కాలేజీ ప్రిన్సిపల్‌పై (principal) విద్యార్థి (student) నిప్పు అంటించారు. తన మార్కుల సీట్ (marks sheet) ఇవ్వడం ఆలస్యం చేస్తున్నారని ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ప్రిన్సిపల్ విముక్త శర్మ (vimukhta sharma) (54) కోసం అశుతోష్ శ్రీ వాత్సవ (ashutosh) కాచుకొని కూర్చున్నాడు. ఆమె ఇంటికి వస్తుండగా అప్పటికే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో ఆమెకు 90 శాతం గాయాలు అయ్యాయి. ఆ వెంటనే అక్కడినుంచి అతను పారిపోయాడు. సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. సమీపంలో గల ఆస్పత్రికి తరలించారు.
నిప్పు అంటించిన అశుతోష్‌కు కూడా కాలిన గాయాలు అయ్యాయి. చేయి, ఛాతీ భాగంలో కాలిపోయింది. కాలేజీ బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ వాచ్ మెన్ అతనిని నిలువరించాడు. పోలీస్ స్టేషన్ (police station) తీసుకెళ్లగా.. చేసిన నేరం అంగీకరించాడు. ప్రిన్సిపల్ వైఖరి వల్లే ఇలా చేశానని చెప్పాడు. ఆమె తీరుతో విసిగి పోయానని చెప్పాడు.
ఏడో, ఎనిమిదో సెమిస్టర్ పరీక్షలు జూలై 2022లో ముగిశాయని అశుతోష్ (ashutosh) చెబుతున్నాడు. చాలా సార్లు మార్కుల షీట్ (మెమో) (memo) ఇవ్వాలని అడిగానని చెప్పారు. కానీ తన గోడును ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రిన్సిపల్‌ను అశుతోష్ ఇదివరకు వేధించాడు. దీనికి సంబంధించి ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. చిన్న కేసు కావడంతో వారు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇదివరకు కాలేజీ ప్రొఫెసర్‌ను కత్తితో దాడి చేశాడు. ఆ కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు.