»Sbi Apprentice Notification 2023 Out 6160 Apprentice Job Vacancies Any Degree Apply
SBI Apprentice Notification 2023: 6,160 ఉద్యోగ ఖాళీలు..ఏనీ డిగ్రీ అప్లై చేయండి
బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ SBI నుంచి 6160 ఖాళీల అప్రెంటీస్ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. తెలుగు రాష్ట్రాలలో కూడా పోస్టులున్నాయి. వాటి వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
6160 Apprentice job vacancies in SBI any degree apply
డిగ్రీ పాసై బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI భారీగా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 6,160 ఖాళీలను భర్తీ చేసేందుకు ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి 21వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం అప్రెంటిస్ ఖాళీలు 6160 ఉండగా..ఏపీలో 390, తెలంగాణలో 125 ఖాళీలున్నాయి.
దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 1, 2023న ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 21, 2023న ముగుస్తుంది. రాత పరీక్ష అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఉండే అవకాశం ఉంది. పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు SBI అధికారిక సైట్ sbi.co.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. జనరల్/ OBC/ EWS కేటగిరీకి దరఖాస్తు రుసుము రూ.300. SC/ST/PwBD కేటగిరీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ రాత పరీక్షద్వారా జరుగుతుంది. వ్రాత పరీక్షలో(Exam) 100 ప్రశ్నలు ఉంటాయి. గరిష్ట మార్కులు 100. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. జనరల్ ఇంగ్లిష్ పరీక్ష మినహా, వ్రాత పరీక్ష కోసం పరీక్ష ప్రశ్నలు 13 ప్రాంతీయ భాషలలో సెట్ చేయబడతాయి. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు ఉంటాయి.