»Sarabjeet Is The Son Of Indira Gandhis Assassin In The Lok Sabha Elections
Lok Sabha elections: లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు
ఇందిరాగాంధీని హత్యచేసిన వారిలో ఒకడైన బియాంత్ సింగ్ కుమారుడు లోక్ సభ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. గతంలో కూడా ఈయన పలు చోట్లు నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది.
Sarabjeet is the son of Indira Gandhi's assassin in the Lok Sabha elections
Lok Sabha elections: ఇందిరాగాంధీని హత్య చేసిన వారిలో ఒకడైన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్జీత్. ఈయనే లోక్ సభ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. గతంలో కూడా పలు ఎన్నికల్లో పోటీలో నిలిచారు. 2004లో బఠిండా స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2007లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భదౌర్ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ బఠిండా, ఫతేగఢ్ సాహిబ్ స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తనకు 3.5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నాడు.
సరబ్జీత్ తల్లి బిమల్ కౌర్ ఖల్సా 1989 సార్వత్రిక ఎన్నికల్లో రోపర్ స్థానం ఎంపీగా గెలిచారు. అదే ఎన్నికల్లో ఆయన తాత సుచాసింగ్ కూడా బఠిండా నుంచి గెలిచాడు. ఇప్పుడు సరబ్జీత్ పోటీ చేస్తున్న ఫరీద్కోట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ సాదిఖ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ తరఫున పంజాబీ జానపద, సినీ నేపథ్య గాయకుడు హన్స్‌రాజ్ హన్స్ పోటీ చేస్తున్నారు. 1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఆమె భద్రతా సిబ్బంది బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ కల్చిచంపిన విషయం తెలిసిందే.