మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌పై వేటు వేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ విజిలెన్స్ తెలిపింది.
Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌పై వేటు వేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ విజిలెన్స్ తెలిపింది. అతని నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తెలిపింది. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. విధుల్లో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశాడని బిభవ్‌పై 2007లో నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు.
కేజ్రీవాల్‌కు పర్సనల్ సెక్రటరీగా నియమించే సమయంలో కేసు వివరాలను వెల్లడించలేదని దర్యాప్తులో తెలిపారు. అయితే ఈ నియామకంలో అవకతవకలు జరిగాయని గుర్తించినట్లు తెలిపారు. పాలనావ్యవహారాల పరంగా ఇది ఇబ్బందికర పరిణామమని, ఎలాంటి ముందస్తు వెరిఫికేషన్ లేకుండా మంత్రుల వ్యక్తిగత సిబ్బందిని నియమించడం సరికాదని విజిలెన్స్ విభాగం తెలిపింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. బిభవ్‌ను ఈడీ విచారించిన మూడు రోజులకే అతనిని విధులు నుంచి తొలగించింది.