Sangrur Court Summons To Congress Chief Mallikarjuna Kharge
Sangrur Court Summons:కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు (Mallikarjuna Kharge) కోర్టు సమన్లు జారీచేసింది. భజరంగ్ దళ్‌పై కామెంట్లపై దాఖలు చేసిన పిటిషన్లో పంజాబ్‌లో గల సంగ్రూర్ కోర్టు సమన్లు ఇష్యూ చేసింది.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భజరంగ్ దళ్‌ను ఉగ్రవాద సంస్థలతో ఖర్గే (Kharge)పోల్చారు. ఈ విషయాన్ని సంగ్రూర్ వాసి హితేష్ భరద్వాజ్ కోర్టులో దావా వేశారు. భజరంగ్ దళ్ పరువుకు నష్టం వాటిల్లిందని.. రూ.100 కోట్లకు కేసు వేశారు. ఆ పిటిషన్ ఈ రోజు విచారించి.. ఖర్గేకు ధర్మాసనం సమన్లు జారీచేసింది.
కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని ప్రకటన చేశారని హితేష్ పేర్కొన్నారు. ఇదీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పదో పేజీలో ఉందని తెలిపారు. హితేష్ పిటిషన్ ఆధారంగా.. ఈ రోజు ఖర్గేకు (Kharge) సమన్లు జారీచేసింది.
ఖర్గే (Kharge) కామెంట్స్.. భజరంగ్ దళ్‌పై నిషేధం కామెంట్స్ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. భజరంగ్ దళ్ బ్యాన్ అంశాన్ని వెనక్కి తీసుకుంది. అప్పటికే వ్యతిరేకత రాగా.. రాష్ట్రంలో కొత్త హనుమాన్ ఆలయాలు నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత డీకే శివకుమార్ హామీనిచ్చారు. కాంగ్రెస్ నేతలు అందరూ హనుమాన్ ఆలయంలోకి వెళ్లి.. హనుమాన్ చాలీసా చదివారు. దీంతో కర్ణాటక ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆదరణ లభించింది. బంపర్ మెజార్టీతో అధికారం చేజిక్కించుకుంది.