»Salim Durani The Afghanistan Born Indian Legend Who Hit Sixes At Will
Salim Durani అర్జున అవార్డు అందుకున్న తొలి క్రికెటర్ కన్నుమూత..!
Salim Durani : భారత మాజీ క్రికెటర్ సలీం దురానీ కన్నుమూశారు. దురానీ చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కాగా.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గుజరాత్లో జామ్‌నగర్‌లో నిన్న తుదిశ్వాస విడిచారు. దురానీ 1934, డిసెంబర్ 11న అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ జన్మించారు.
భారత మాజీ క్రికెటర్ సలీం దురానీ కన్నుమూశారు. దురానీ చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కాగా.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గుజరాత్లో జామ్‌నగర్‌లో నిన్న తుదిశ్వాస విడిచారు. దురానీ 1934, డిసెంబర్ 11న అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ జన్మించారు. తనకు 8 నెలల వయస్సు ఉన్నప్పుడు ఆయన కుటుంబం కరాచీకి వలస వచ్చి స్థిరపడింది. 1947లో భారత్-పాక్ విభజన అనంతరం దురానీ కుటుంబం భారత్‌కు వచ్చేసింది. ప్రస్తుతం గుజరాత్‌లోన జామ్‌నగర్‌లో తన సోదరుడు జహంగీర్ దురానీతో కలిసి నివసిస్తున్న ఆయన ఈ ఏడాది జనవరిలో తొడ ఎముక ఆపరేషన్ చేయించుకున్నాడు.
1960లో ముంబైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో భారత్ తరుపున అరంగేట్రం చేశారు. 1960-70 దశకంలో భారత జట్టులో ఆల్‌రౌండర్‌గా గుర్తింపుపొందారు. ఆయన 29 టెస్టులు ఆడాడు. ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలతో 1202 పరుగులు చేసిన దురానీ.. 75 వికెట్లు కూడా పడగొట్టారు. 1962లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను గెలవడంలో సలీం దురానీ కీలకపాత్ర పోషించాడు.. ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-0 తో గెలుచుకుంది. ఈ సిరీస్ లో దురానీ 18 వికెట్లు పడగొట్టాడు. 1971లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
బౌలింగ్‌తోపాటు తన బ్యాటింగ్‌లో జట్టు విజయాల్లో ప్రముఖ పాత్రపోషించారు. ఆయన చివరిసారిగా 1973, ఫిబ్రవరిలో ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆడారు. భారత ప్రభుత్వం అందించే అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును కూడా సలీం దురానీ అందుకున్నారు. అర్జున అవార్డు అందుకున్న మొదటి క్రికెటర్ కూడా ఈయనే.. ఆ తర్వాత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దురానీ.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దురానీ మృతిపట్ల మాజీ క్రికెటర్ రవిశాస్త్రి, గవాస్కర్, కపిల్ దేవ్. వీవీఎస్ లక్ష్మణ్ సంతాపం ప్రకటించారు.