కేరళను నైరుతి రుతుపవనాలు చుట్టుమట్టాయి. రాష్ట్రమంతటా జలాశయాలు నిండుకుండలా మారాయి. తీరప్రాంత ప్రజలు ప్రాణాలు ఆరిచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టారు.
నైరుతి రుతపవనాల(Southwest Monsoon) ప్రభావం కేరళ(Kerala)పై అధికంగా ఉంది. గత కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలలో సామాన్యుల జీవనానికి అంతరాయాలకు ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. తాజాగా భారత వాతావరణ శాఖ(IMD) ప్రకటనతో అందరిలో భయం నెలకొంది. కేరళ తీర ప్రాంతా(Coastal region of Kerala)ల్లో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) హెచ్చరికతో ఆ ప్రాంత వాసులలో ఆందోళన మొదలైంది.
రాష్ట్రంలో ఇడుక్కి(Idukki), కన్నూర్(Kannur) జిల్లాలకు ఐఎండీ సంస్థ రెడ్ అలర్ట్(Red alert) జారీ చేసింది. అలాగే మరో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్(Orange Alert) జారీ చేసింది. ఇప్పటికే ఎర్నాకుళం, అళప్పుజ విద్యాసంస్థల మూసివేతకు ఆదేశాలు ఇచ్చారు. కాసర్ గోడ్ జిల్లాలో చెట్టు విరిగిపడడంతో ఓ బాలిక మృతి చెందింది. దాంతో ఈ జిల్లాలో స్కూళ్లు మూసివేయనున్నారు. సీఎం పినరయి విజయన్(CM Pinarayi Vijayan) రాష్ట్రంలో వర్ష బీభత్సాన్ని(Rain disaster) ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రెస్య్యూ టీమ్ లకు సంబంధించిన అన్ని విభాగాల బలగాలను సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వర్ష ప్రభావం అధికంగా ఉన్న పలు జిల్లాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.
కేరళలో 2018, 2020లో భారీ వరదలు సంభవించడం తెలిసిందే. ముఖ్యంగా, 2018లో కేరళ వరదలకు 483 మంది మృత్యువాతపడ్డారు. 2020లోనూ కేరళను వరదలు ముంచెత్తగా, 104 మంది మరణించారు. మళ్లీ ఆలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా కేరళ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక రెడ్ అలెర్ట్ విధించిన ప్రాంతాలలో ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని ఉన్నట్లు తెలుస్తుంది.