అదానీ గ్రూపు అక్రమాలపై పత్రికల్లో కథనాలు వచ్చాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అదానీ గ్రూపు వల్ల ఎవరికీ మేలు జరుగుతుంది.. అదానీకా లేదంటే మరొవరికైనా అని సందేహాం వ్యక్తం చేశారు.
Adani: పెట్టుబడులో అదానీ గ్రూపు (Adani) షేర్ల ధరలను కావాలనే పెంచారు.. షేర్ల పెరుగుదలతో వచ్చిన సొమ్ముతో అదానీ (Adani) ఆస్తులు కొనుగోలు చేశారు. అదానీ పోర్టులు, ఎయిర్ పోర్టులు కొనుగోలు చేశారు.. ఈ డబ్బు ఎవరిదీ.. అదానీదేనా.? (Adani) ఇంకెవరిదైనా అని సందేహాం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అక్రమాల మాస్టర్ మైండ్ గౌతమ్ అదానీ (Adani) సోదరుడు వినోద్ అని ఆరోపించారు. దీని వెనక నాసర్ అలీ, ఛాంగ్ చుంగ లింగ్ ఉన్నారని కథనాలు వచ్చాయని తెలిపారు. గతంలో వచ్చిన ఆరోపణలపై అదానీ గ్రూపునకు సెబీ క్లీన్ చిట్ ఇచ్చిందని.. అతను ఇప్పుడు ఎన్డీటీవీలో డైరెక్టర్‌గా ఉన్నాడని రాహుల్ వివరించారు. జరిగిన పరిణామాలను బట్టి ఏదో తప్పు జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ముంబైలో ఇండియా కూటమి సమావేశానికి తల్లి సోనియా గాంధీతో కలిసి రాహుల్ గాంధీ హాజరయ్యారు.
అదానీ (Adani) ఇష్యూలో ఫైనాన్షియల్ పేపర్స్ పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని తెలిపారు. ప్రధాని మోడీకి సన్నిహితుడైన ఒకరు తన సంస్థ షేర్ల విలువ పెంచేందుకు బిలియన్ డాలర్లను విదేశాల నుంచి పెట్టబడులు పెట్టించారు.. ఆ స్కామ్‌పై ఎందుకు విచారణ చేయరని రాహుల్ సూటిగా ప్రశ్నించారు. అలాగే అదానీ గ్రూప్ వ్యవహారంపై జేపీసీతో ఎందుకు విచారణ చేయించడం లేదని అడిగారు. విచారణకు మోడీ ఎందుకు చొరవ తీసుకోవడం లేదన్నారు. స్కాం చేసిన వారిని ఎందుకు జైళ్లలో పెట్టడం లేదని నిలదీశారు.
ఢిల్లీలో జీ 20 సదస్సు జరగనుంది. ఆ మీటింగ్‌లో అదానీ గ్రూపు గురించి విదేశీ నేతలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని అడిగారు. అదానీ సంస్థ ఎందుకు ప్రత్యేక సంస్థగా మారిందని అడిగారు. అదానీ గ్రూపు వ్యవహారంపై జేపీసీతో సమగ్ర విచారణ జరిపించాలని మరోసారి రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.