PM Modi: మీకన్నా ఆస్ట్రేలియా నేతలు నయం.. విపక్షాలపై ప్రధాని మోడీ విసుర్లు
విపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్ అయ్యాయి. మీ కన్నా ఆస్ట్రేలియా నేతలు నయం అన్నారు. పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి రామని చెప్పడంతో ఈ మేరకు కామెంట్స్ చేశారు.
PM Modi: పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవంపై వివాదం నెలకొంది. రాష్ట్రపతి (president) చేతుల మీదుగా ఆవిష్కరించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. అదేం లేదని.. ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభిస్తారని అధికార బీజేపీ (bjp) అంటోంది. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియా వచ్చిన ప్రధాని మోడీ (modi).. విపక్షాల తీరుపై ఫైరయ్యారు. ఇండైరెక్టుగా ఆస్ట్రేలియా పొలిటిషీయన్స్ నయం అని చెప్పేశారు.
విదేశీ పర్యటన ముగించుకొని మోడీ (modi) గురువారం ఉదయం భారత్ వచ్చారు. ప్రవాస భారతీయులతో జరిగిన సభను ప్రధాని గుర్తుచేశారు. ఆ ‘సభలో 20 వేల మంది పాల్గొన్నారని.. ప్రధాని ఆంథోనీ అల్బనీస్, మాజీ ప్రధాని, ఇతర విపక్ష ఎంపీలు, నేతలు పాల్గొన్నారు. దేశానికి అధికార, విపక్ష నేతలు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. కమ్యూనిటీ ఈవెంట్కు కలిసికట్టుగా వచ్చి.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారు’ అని ప్రధాని మోడీ (modi) పేర్కొన్నారు.
ఈ నెల 28వ తేదీన పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం ఉంది. రాష్ట్రపతి (president) చేతుల మీదుగా ప్రారంభిస్తే వస్తామని విపక్షాలు అంటున్నాయి. గతంలో పార్లమెంట్ అనుబంధ భవనాలను ఇందిరా గాంధీ (indira gandhi), రాజీవ్ గాంధీ (rajeev gandhi) ఆవిష్కరించలేదా అని బీజేపీ (bjp) ఎదురు ప్రశ్నిస్తోంది. కార్యక్రమానికి హాజరకాబోమని 19 విపక్షాలు కలిసి ప్రకటన చేశాయి. ఈ అంశంపై బీజేపీ సహా ఎన్డీఏ 14 పక్షాలు స్పందించాయి.