తమకు అన్నీ తెలుసునని భావించే బీజేపీ ఎవరినీ గౌరవించని ‘క్లాస్ రౌడీ’ లాంటిదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. మరోవైపు మేఘాలయ షిల్లాంగ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న క్రమంలో రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే బీజేపీని గెలిపించేందుకే టీఎంసీ పోటీ చేస్తుందని ఎద్దేవా చేశారు.
సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం రణ్‌బీర్ కపూర్ ఒప్పకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలో కోల్‌కతాలో ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని నెట్టింట ఈ వార్త హల్ చల్ చేస్తుంది.
KL రాహుల్ ఫామ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో భారత జట్టు నుంచి ఓపెనర్ రాహుల్ ను తప్పించాలా అనే ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్ జీపీటీ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది. అదేంటో ఇక్కడ చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం పెద్ద ఎత్తున నష్టాలతో చవిచూశాయి. BSE సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లకుపైగా నష్టపోగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 273, బ్యాంక్ నిఫ్టీ 700 పాయింట్లకుపైగా దిగువకు పయనించాయి. దీంతో ఒక్కరోజే సమారు 3.5 లక్షల కోట్ల సంపదను మదుపర్లు కోల్పోయారు.
గత ఏడాది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధికంగా విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ మూడు విఫల ప్రయత్నాల తర్వాత ఈరోజు తన మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్ 34 ఓట్ల తేడాతో గెలుపొందారు. మేయర్ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులకు ఓటు వేయాలనే నిర్ణయంపై ఆప్, బీజేపీ సభ్యులు వాగ్వాదానికి దిగడంతో గతంలో మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశాలు వాయిదా పడ్డాయి.
దేశ రాజధాని ఢిల్లీ ఈ రోజు మధ్యాహ్నం భూ ప్రకంపనాలతో వణికింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. నేపాల్‌లో గల జుమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1.30 గంటలకు భూమి కంపించగా.. దాని తీవ్రత 10 కిలోమీటర్ల లోతు వరకు ఉందని సిస్మలాజిస్టులు తెలిపారు.
తమిళ నటుడు ప్రభు అనారోగ్యానికి గురయ్యారు. ఆకస్మాత్తుగా తనకు కిడ్నీలో రాళ్ల నొప్పి రావడంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ప్రభు బాగానే ఉన్నాడని.. త్వరలోనే డిశ్చార్జ్ అవుతాడని వైద్యులు ప్రకటించారు.
straydogs bite:వీధి కుక్కలు (straydogs) స్వైరవిహరం చేస్తున్నాయి. అంబర్ పేట (amberpet) ఘటనతో తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అంబర్ పేట తర్వాత చైత్యనపురి.. అటు నుంచి కరీంనగర్‌లో (karimnagar) కూడా స్ట్రీట్ డాగ్స్ రెచ్చిపోయాయి. వరస ఘటనలతో కుక్కల బెడదపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వీధి కుక్కల నియంత్రణపై చర్యలేవి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
భోజ్‌పురి (Bhojpuri) జానపద గాయని నేహా సింగ్ (Neha Singh) రాథోడ్‌కు ఉత్తర ప్రదేశ్ పోలీసులు (UP Police) షాకిచ్చారు. ఆమె ఇటీవల విడుదల చేసిన ఒక పాటలో ఉత్తర ప్రదేశ్‌పై విమర్శలు చేయడంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. బిహార్‌కు చెందిన నేహా సింగ్ భోజ్‌పురి జానపద గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
వివిధ కంపెనీల్లో ఉద్యోగాల కోత (layoffs) కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకెన్సీ (McKinsey) 2000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. తమ క్లయింట్స్ తో నేరుగా సంబంధాలు ఉండని సహాయక సిబ్బందిని తొలగించే యోచనలో మెకెన్సీ ఉందని వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ శాండిల్ వుడ్ నటుడు (sandalwood), మాజీ మంత్రి అనంత్ నాగ్ (Ananth Nag) ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. కర్నాటక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నలిన్ కటీల్ ఆధ్వర్యంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు పార్టీ కార్యాలయంలో కమల తీర్థం పుచ్చుకోనున్నారు.
కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్ పోర్టేషన్ కార్పొరేషన్ (కేకేఆర్టీసీ)కు చెందిన ఓ బస్సు చోరీ (Chori) కావడం కలకలం రేపింది. రాత్రిపూట బస్టాండ్ ఆవరణలో పార్క్ చేసిన బస్సు తెల్లారేసరికి మాయమైంది. దీంతో ఆర్టీసీ (RTC) అధికారులు పోలీసులను ఆశ్రయించారు.
ఢిల్లీ మేయర్ ఎన్నిక (Delhi Mayor Election) ఈ రోజు (బుధవారం, ఫిబ్రవరి 22) జరగనుంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 2022 డిసెంబర్ 7న ప్రకటించిన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి 104 (bharatiya janata party), ఆమ్ ఆద్మీ పార్టీకి (Aam Admi party) 134, కాంగ్రెస్ పార్టీకి (Congress) 9 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే.
బీహార్ (Bihar) ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యవసాయ పారిశ్రామికవేత్త పై ఫైర్ (fire) అయ్యారు. ఇంగ్లీష్ పదాలను అతి వినియెగంపై సీ ఎం వారించారు. తన జీవిత ప్రయాణాన్ని, తన విజయాల గురించి చెెబుతూ అమిత్ కుమార్ (Amithkumar) అనే వ్యక్తి ప్రసంగం చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ ఏనుగు (jharkhand elephant attack) అయిదు జిల్లాల్లో గ్రామస్థులను భయాందోళనకు గురి చేస్తోన్న విషయం తెలిసిందే. ఏనుగు కేవలం 12 రోజుల్లో 16 మందిని పొట్టన పెడ్డుకున్నది. ఇందులో ఒక రాంచీ జిల్లాలోనే నలుగురిని చంపేసింది.