బీహార్ (Bihar) ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యవసాయ పారిశ్రామికవేత్త పై ఫైర్ (fire) అయ్యారు. ఇంగ్లీష్ పదాలను అతి వినియెగంపై సీ ఎం వారించారు. తన జీవిత ప్రయాణాన్ని, తన విజయాల గురించి చెెబుతూ అమిత్ కుమార్ (Amithkumar) అనే వ్యక్తి ప్రసంగం చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
బీహార్ (Bihar) ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యవసాయ పారిశ్రామికవేత్త పై ఫైర్ (fire) అయ్యారు. ఇంగ్లీష్ పదాలను అతి వినియెగంపై సీ ఎం వారించారు. తన జీవిత ప్రయాణాన్ని, తన విజయాల గురించి చెెబుతూ అమిత్ కుమార్ (Amithkumar) అనే వ్యక్తి ప్రసంగం చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. రాష్ట్రప్రభుత్వం ‘నాలుగో వ్యవసాయ రోడ్ మ్యాప్’ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పాట్నాలోని బాపు సభాగర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. పూణేలో( pune) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అమిత్ కుమార్ అన్నింటిని వదులుకుని సొంత జిల్లాలో పుట్టగొడుగుల పెంపకం చేపట్టారు. ఇందుకు తగిన వాతావరణం కల్పించిన సీఎం నితీష్ కుమార్ పై ప్రశంసలు కురిపించారు. అయితే ఆయన ఇంగ్లీష్ లో ప్రసంగిస్తుండటంతో, సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) కల్పించుకని.. మీరు ఎక్కువగా ఇంగ్లీష్ పదాలను వాడుతుడటంతో మధ్యలో కల్పించుకోవాల్సి వచ్చిందని, ఇదేమైనా ఇంగ్లాండా.? మీరు బీహార్ లో పనిచేస్తున్నారు, సామన్యుల వృత్తి అయిన వ్యవసాయాన్ని చేస్తున్నారని, గవర్నమెంట్ (goverment ) స్కూల్స్ బదులు సర్కారీ యోజన అనలేరా..? అని ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా చప్పట్లతో సీఎం వ్యాఖ్యల్ని స్వాగతించారు. తాను కూడా ఇంగ్లిష్‌లోనే ఇంజినీరింగ్(Engineering )చదివానని, అది వేరే విషయమని అన్నారు. రోజువారీ కార్యకలాపాలకు ఇంగ్లిష్‌ను ఎందుకు ఉపయోగించాలని సీఎం నితీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.