»Rahul Gandhi Comments On Tmc And Bjp At Meghalaya
Rahul Gandhi: బీజేపీ అధికారంలోకి వచ్చేందుకే టీఎంసీ పోటీ
తమకు అన్నీ తెలుసునని భావించే బీజేపీ ఎవరినీ గౌరవించని ‘క్లాస్ రౌడీ’ లాంటిదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. మరోవైపు మేఘాలయ షిల్లాంగ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న క్రమంలో రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే బీజేపీని గెలిపించేందుకే టీఎంసీ పోటీ చేస్తుందని ఎద్దేవా చేశారు.
తమకు అన్నీ తెలుసునని భావించే బీజేపీ(bjp) ఎవరినీ గౌరవించని ‘క్లాస్ రౌడీ’ లాంటిదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi) ఆరోపించారు. మేఘాలయ(meghalaya) షిల్లాంగ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా మేఘాలయలో తృణమూల్ కాంగ్రెస్(TMC) పార్టీ పోరాడుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్లు తనకు అన్నీ తెలుసని అనుకుంటారు. కానీ వారితో సమిష్టిగా పోరాడాలని ఆయన అన్నారు. మేఘాలయ భాష, సంస్కృతి, చరిత్రకు హాని కలిగించే బీజేపీని కాంగ్రెస్(congress) అనుమతించబోదని స్పష్టం చేశారు. మీ సంస్కృతి, సంప్రదాయానికి గౌరవ సూచకంగా నేను సాంప్రదాయ జాకెట్ను ధరించానని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. నా చర్యలు ఈ జాకెట్ను ప్రతిబింబిస్తాయన్నారు. తాను ప్రధానమంత్రిగా ఇక్కడికి వస్తే ఈ జాకెట్ ధరించి, మీ మతం, సంస్కృతి, చరిత్ర, భాషపై దాడి చేస్తే నేను అడ్డుకుంటామన్నారు. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్(bengal)లో హింసాత్మక సంఘటనలు, కుంభకోణాలు మీకు తెలుసని అక్కడి ప్రజలకు గుర్తు చేశారు.
టీఎంసీ(TMC) గోవా(goa) ఎన్నికల్లో భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేశారని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఇక్కడ బీజేపీ(bjp)కి సహాయం చేయాలనే ఆలోచనతో ఉన్నారని మరోసారి గుర్తు చేశారు. రాష్ట్రంలోని కాన్రాడ్ కె సంగ్మా నేతృత్వంలోని MDA ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని గాంధీ విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్(rss) తమ భావజాలంతో దేశంలోని సంస్థలపై దాడి చేస్తున్నాయని గాంధీ(rahul gandhi) ఆరోపించారు. అది తమిళనాడు, కర్ణాటక, జమ్మూ కశ్మీర్ లేదా హర్యానా ఇలా ప్రతి ఒక్క రాష్ట్రం ఆర్ఎస్ఎస్ చేత దాడి చేయబడుతోందన్నారు. అన్ని రాష్ట్రాలపై ఒకే ఆలోచనను ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలోని ప్రతి ఒక్క సంస్థ అది పార్లమెంటు, మీడియా, ఎన్నికల సంఘం లేదా న్యాయవ్యవస్థ ఇలా అనేకం..ఆర్ఎస్ఎస్(rss), బీజేపీ(bjp)ల భావజాలంతో ఒత్తిడికి గురవుతున్నాయని ఆయన అన్నారు. మరోవైపు కర్ణాటకలోని మతమార్పిడి నిరోధక చట్టం, మూక హత్యల ఘటనలను ప్రస్తావించారు.