»Ktr Has No Interest Of Dog Issue Resolverevanth Reddy
Revanth reddy:ఫార్ములా వన్ రేస్ మీద ఉన్న శ్రద్ద.. కుక్కల బెడద నివారణపై లేదు
Revanth reddy:అంబర్ పేటలో చిన్నారి ప్రదీప్‌ను వీధి కుక్కల దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఇదీ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాలి.. మంత్రి కేటీఆర్ (ktr) మాత్రం వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తామనడం ఏంటీ అని అడిగారు.
Revanth reddy:అంబర్ పేటలో చిన్నారి ప్రదీప్‌ను వీధి కుక్కల దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఇదీ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాలి.. మంత్రి కేటీఆర్ (ktr) మాత్రం వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తామనడం ఏంటీ అని అడిగారు. ఇదేం వైఖరి అని దుయ్యబట్టారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి (Revanth reddy) భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
మంత్రి కేటీఆర్ కు (ktr) ఫార్ములా వన్ రేస్ (formula one race) పట్ల ఉన్న శ్రద్ధ, నగరంలో కుక్కల (dogs) బెడద నివారించడంపై లేదా? అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ (ktr) తక్షణమే పరామర్శించాలని కోరారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కుక్కలకు ఆకలి వేసి బాలుడిపై దాడి చేశాయని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. పాదయాత్రకు ముందు ప్రసిద్ధ కోటంచ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని రేవంత్ రెడ్డి (Revanth reddy) సందర్శించారు. భూపాలపల్లిలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. పామాయిల్ కంపెనీ పేరుతో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి (gandra venkata ramana reddy) పేదల భూములను ఆక్రమించారని ఆరోపించారు. విచారణకు ఆదేశించాలని మంత్రి కేటీఆర్‌ను డిమాండ్ చేశారు.
గ్రేటర్ పరిధిలో రోజుకు 300 మందికి (300) పైగా కుక్కకాటుకు గురవుతారని తెలిసింది. కొత్తపేట (kothapeta) మారుతినగర్ రోడ్ నంబర్ 19లో రిషి అనే బాలుడిపై కూడా కుక్కలు దాడి చేశాయి. ఈ నెల 8వ తేదీన కొంపల్లిలో ఆరేళ్ల చిన్నారి రమ్య (ramya), 15వ తేదీన భార్గవి (bhargavi), గత నెల 11వ తేదీన తను శ్రీపై కుక్కల దాడి చేశాయి. హైదరాబాద్ జిల్లాలో 2017 నుంచి ఇప్పటివరకు 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్- మల్కాజిగిరిలో 6 వేలు, రంగారెడ్డిలో 25 వేలు, వికారాబాద్‌లో 20 వేల కేసులు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో 5.75 లక్షల కుక్కలు ఉన్నాయని మేయర్ చెబుతున్నారు. వాస్తవం అందుకు విరుద్దంగా ఉంది.