200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తన జైల్లో ఏడ్చిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు తనతోపాటు విలావంతమైన వస్తువులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న తిలక్ యాదవ్ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. అతడి మృతితో ఉమేశ్ యాదవ్ తీవ్ర విషాదంలో మునిగాడు.
బుధవారం రూప మాడ్గిల్ (IPS officer D. Roopa Moudgil) తన పర్సనల్ ఫోటోలతో పోస్టులు పెట్టడంతో రోహిణి సింధూరి (IAS officer Rohini Sindhuri) తీవ్రంగా పరిగణించారు. తనకు 24 గంటల్లో రాతపూర్వక క్షమాపణ (unconditional apology) చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, తనపై చేసిన అవాస్తవ వ్యాఖ్యలకు గాను (defamatory comments) తనకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని లీగల్ నోటీసులు పంపించారు.
అమిత్ రతన్ మొదటి నుంచి వివాదాలకు కేంద్రంగా ఉన్నాడు. గతంలోనే లంచం వ్యవహారంలో ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఇన్నాళ్లు అతడిపై పోలీసులు, విచారణ సంస్థలు చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేశాయి.
ED questions Kejriwal's PA:ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ అధినేత, హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ పేరు చేర్చిన తర్వాత ఆయన పీఏకు ఈడీ సమన్లు జారీచేసింది. ఈ రోజు విచారణకు పిలిచి, ప్రశ్నిస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టకు 2023 సీజన్లో కొత్త కెప్టెన్ గా ఐడెన్ మార్క్రామ్‌ను జట్ట యాజమాన్యం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ క్రమంలో ది వేయిట్ ఇస్ ఓవర్. ఆరెంజ్ ఆర్మీ మా కొత్త కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్‌కి హలో చెప్పండంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు.
తెలంగాణ గవర్నర్ (Telangana governor) తమిళసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) వ్యాఖ్యలపై తమిళనాడులో (Tamil Nadu) కాంగ్రెస్ (Congress), డీఎంకే (DMK) పార్టీలు తీవ్ర విమర్శలు చేయగా, తమిళనాట భారతీయ జనతా పార్టీ (BJP) అధ్యక్షులు అన్నామలై (Annamalai) వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
పలువురు అమ్మకం దారులు కొన్ని రకాల ఉత్పత్తులను ప్రత్యేకంగా సేల్ చేస్తున్న విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారు ఆయా ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేసేలా ప్రమోట్ చేస్తున్న ఈ క్రేజీ వీడియోలను ఓ సారి చూసేయండి.
పార్టీలో నా ప్రయాణం సాహసోపేతంగా సాగింది. రెండు దశాబ్దాలుగా నిస్వార్థంగా పని చేశా. కానీ ప్రస్తుతం పార్టీలో విలువలు లేవు. నాకు గౌరవం కూడా లేదు. ఈ క్రమంలోనే రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనలేదు. ఇప్పుడు కొత్త మార్గాన్ని అన్వేషించుకోవాలని భావిస్తున్నా.
అదానీ గ్రూప్ ఒక్క నెలలోపే రూ.11.65 లక్షల కోట్లకుపైగా మార్కెట్ విలువను కోల్పోయింది. అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ జనవరి 25 తర్వాత ఈ సంస్థ మార్కెట్ విలువ క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ సంస్థ మార్కెట్ విలువ జనవరి 24న రూ.19.12 లక్షల కోట్లుగా ఉండగా..ప్రస్తుతం 7.55 లక్షల కోట్ల కంటే తక్కువగా ఉంది.
కరోనా మహమ్మారి భయం కారణంగా ఓ మహిళ ఏకంగా మూడేళ్లుగా ఇంట్లో నుండి బయటకు రాని సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో (New Delhi) గురుగ్రామ్ (Gurugram) చక్కార్ పూర్ లో వెలుగు చూసింది.
నూతన విద్యా విధానాన్ని (National Education Policy) అనుసరించి ఇక నుండి ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యా శాఖ (Ministry of Education)... రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు లేఖ రాసింది.
కర్నాటకలో (Karnataka) ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) అధికారుణుల (Civil Servants) మధ్య వివాదం రాజుకుంది. ఇద్దరు మహిళా అధికారుల మధ్య సోషల్ మీడియా (Social Media) వేదికగా వాగ్యుద్ధం నడుస్తుండటంపై ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించింది. దీంతో ఇద్దరినీ బదలీ చేసి, పోస్ట్ ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచింది బసవరాజ్ బొమ్మై (basavaraj bommai) ప్రభుత్వం (Government).
మద్యంమత్తులో ఉన్నవారు నానా రచ్చ చేస్తున్నారు. ఇన్నాళ్లు నాలుగు గోడల మధ్యన వీరి ఆగడాలు ఉండేవి. ఇప్పుడు తప్ప తాగి బయటకు వచ్చి బీభత్సం చేస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం లభిస్తుండడంతో మద్యం సేవించి దాడులకు తెగబడుతున్నారు. దీనికి తోడు ఆర్టీసీ బస్సులు, విమానాల్లో మద్యం సేవించి ప్రయాణం చేయవద్దనే నిబంధనలు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
రెండు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేక గాలులు వస్తున్నాయి. ఆ పార్టీ గట్టెక్కడం కష్టంగా ఉందని సమాచారం. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న యడియూరప్పకు మళ్లీ అవకాశం దక్కడం అసాధ్యమే. ఆ పదవి ఇవ్వకుంటే ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే తనకు గౌరవం ఉండదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యాడు.