Sukhesh Chandrasekhar: జైల్లో ఏడ్చేశాడు…విలువైన వస్తువులు స్వాధీనం
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తన జైల్లో ఏడ్చిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు తనతోపాటు విలావంతమైన వస్తువులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసు(money laundering case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్(sukesh chandrasekhar)ను పోలీసులు(police)ఇప్పటికే అరెస్టు చేశారు. రిలిగేర్ మాజీ ప్రమోటర్ మల్వీందర్ సింగ్ భార్య జప్నా సింగ్ దాఖలు చేసిన మనీలాండరింగ్ అభియోగంపై ఢిల్లీ కోర్టు(delhi court) గత వారం సుఖేష్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తొమ్మిది రోజుల కస్టడీకి పంపింది. ఆ క్రమంలో డిల్లీలోని మండోలి జైలులో ఓ మూలన ఉన్న సుఖేష్ ఏడ్చినట్లు తెలుస్తోంది. ఆ దృశ్యాలు జైలు రూం సీసీటీవీ(CCTV) కెమెరాల్లో రికార్డయ్యాయి. మరోవైపు అతను ఉంటున్న గదిలో లగ్జరీ వస్తువులను అధికారులు గుర్తించారు.
#WATCH | Luxury items found in conman Sukesh Chandrasekhar’s jail cell. CCTV visuals from Mandoli jail shared by sources show Sukesh after raids caught items in his jail cell.
అతనిపై తాజా అభియోగాలు ₹ 3.5 కోట్లకు పైగా మిస్టర్ శివిందర్ సింగ్ భార్య తన భర్తకు బెయిల్(bail) ఇవ్వడానికి చెల్లించిందని ఆరోపించింది. ఈ కేసులో ఇప్పటికే బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్(jacqueline fernandez), నోరా ఫతేహీ(nora fatehi)లను పోలీసులు ప్రశ్నించారు. బుధవారం అతని జైలు గదిలో అధికారుల ఆకస్మిక తినిఖీల్లో భాగంగా గుచ్చి చెప్పులు, రూ.1.5 లక్షల నగదు, రూ.80,000 కంటే ఎక్కువ విలువైన ఒక జత జీన్స్ సహా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ లకు బెయిల్(bail) ఇప్పిస్తామని నమ్మించి వారి భార్య దగ్గర నుంచి సుకేష్ చంద్ర శేఖర్(sukesh chandrasekhar) 200 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సుకేష్ న్యాయశాఖలో ప్రముఖులను పరిచయం చేసుకుని ఈ దాందా చేసినట్లు తెలిసింది. ఇలా పలువురి నుంచి నగదు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో చంద్రశేఖర్ సన్నిహితుడు లీనా మారియా పాల్ సహా బాలీవుడ్ నటి జాక్వెలిన్ లకు సంబంధం ఉందన్న కారణంతో వీరిని అధికారులు ప్రశ్నించారు.