సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టకు 2023 సీజన్లో కొత్త కెప్టెన్ గా ఐడెన్ మార్క్రామ్ను జట్ట యాజమాన్యం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ క్రమంలో ది వేయిట్ ఇస్ ఓవర్. ఆరెంజ్ ఆర్మీ మా కొత్త కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్కి హలో చెప్పండంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు.
గత కొన్నిరోజులుగా కెప్టెన్ లేని ఏకైక ఐపీఎల్ జట్టుగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)కు ఎట్టకేలకు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. ఈ సీజన్‌కు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఐడెన్ మార్క్రామ్(aiden markram)ను జట్ట యాజమాన్యం కెప్టెన్‌గా ప్రకటించింది. కావ్య మారన్ యాజమాన్యంలోని టీమ్(team) ఈ మేరకు ట్విటర్(twitter) ద్వారా మార్క్రామ్ పేరును గురువారం వెల్లడించింది. ఈ క్రమంలో ది వేయిట్ ఇస్ ఓవర్. ఆరెంజ్ ఆర్మీ మా కొత్త కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్కి హలో చెప్పండంటూ రాసుకొచ్చారు.
మరోవైపు సన్ రైజర్స్ జట్టు(sunrisers hyderabad team) మళ్లీ ఫారెన్ ఆటగాళ్లకు కెప్టెన్ పదవీ ఇవ్వడం పట్ల పలువురు అభిమానులు నిరాశను వ్యక్తం చేశారు. ఇప్పటికే గతంలో కూడా డేవిడ్ వార్నర్, ఆ తర్వాత కేన్ విలియమ్సన్ వంటి వారిని ఎంపిక చేశారు. ఆ క్రమంలో మధ్యలో కొన్ని రోజులు తాత్కాలికంగా భూవనేశ్వర్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ సీజన్ కు ముందు జరిగిన వేలంలో విలియమ్స్ ను సన్ రైజర్స్ కొనుగోలు చేయకపోవడంతో అసలు ఈ జట్టకు కెప్టెన్ ఎవరు ఉంటారని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఆ క్రమంలో మార్క్రామ్ లేదా పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్(mayank agarwal)ను కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేయవచ్చని ఊహాగానాలు వచ్చాయి.
28 ఏళ్ల మార్క్రామ్ సన్ గ్రూప్ యాజమాన్యంలోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు సారథ్యం వహించారు. ప్రారంభ SA20 టైటిల్‌ను కైవసం చేసుకున్న తర్వాత సెమీ ఫైనల్లో సెంచరీతో సహా 336 పరుగులు చేసి టోర్నీలో 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ఆల్ రౌండర్ గత సంవత్సరం కూడా గొప్ప IPL సీజన్లో మంచి ప్రదర్శన ఇచ్చాడు. అప్పుడు మూడు అర్ధ సెంచరీలతో 139 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 47.63 సగటుతో 381 పరుగులు చేశాడు.
హై ప్రొఫైల్ ఐపీఎల్లో జట్టుకు నాయకత్వం వహించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగినప్పుడు మార్క్రామ్(aiden markram) సానుకూలంగా స్పందించాడు. కెప్టెన్‌గా మారడం అనేది అందరినీ ముగించడం కాదు. మీరు నాయకత్వ పాత్రతోపాటు ఏదో ఒక రూపంలో ఉండవచ్చన్నారు. కానీ నేను కెప్టెన్సీని చేయడం ఆస్వాదిస్తానని ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన SA20 ఫైనల్‌కు ముందు ఇతను అన్నాడు. ఈ టోర్నీ ప్రారంభం కావడానికి ముందు నేను కొంతకాలం కెప్టెన్‌గా ఉన్నాను. ఇది మంచి అనుభవమని వెల్లడించారు.
ఫుల్ టీమ్
IPL 2023లో SRH పూర్తి జట్టు అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్*, భువనేశ్వర్ కుమార్(bhuvneshwar kumar), ఫజల్హాక్ ఫారూకీ*, గ్లెన్ ఫిలిప్స్*, కార్తీక్ త్యాగి, మార్కో జాన్సెన్*, రాహుల్ సింగ్ త్రిపాఠి, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, అన్ప్రీలెట్, వాషింగ్టన్ సున్ప్రేట్దార్ , అకేల్ హోసేన్*, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సన్వీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, వివ్రంత్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్*, హెన్రిచ్ క్లాసెన్*, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్*