»Bhupalpally Mla Gandra Venkataramana Reddy Should Be Investigated On Land Encroachment Revanth Reddy Challenge To Ktr
Revanth Reddy: నీ ఎమ్మెల్యే రమణా రెడ్డి భూ ఆక్రమణలపై విచారణ చేయాలి KTRకు సవాల్
నీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఆక్రమించుకున్న భూములు, సింగరేణి నిధుల దోపిడీ, అక్రమ కాంట్రాక్టుల మీద విచారణకు ఆదేశించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు సవాల్ చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించిన క్రమంలో రేవంత్ రెడ్డి ఈ విధంగా పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన పోవాలని ప్రజలను సూచించారు.
నీ భూపాలపల్లి(bhupalpally) ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి(gandra venkataramana reddy) ఆక్రమించుకున్న భూములు, సింగరేణి నిధుల దోపిడీ, అక్రమ కాంట్రాక్టుల మీద విచారణకు ఆదేశించే ధైర్యం… మంత్రి కేటీఆర్(ktr) కు ఉందా అంటూ టీపీసీసీ(tpcc) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) సవాల్ విసిరారు. రాజీవ్ బోమ్మ సాక్షిగా సవాల్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా డ్రామారావు మా సవాల్ స్వీకరించాలని రేవంత్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు(kaleshwaram project)లో భాగంగా డీజిల్ సరఫరాలో నీ ఎమ్మెల్యే కోట్ల రూపాయలు దోచుకున్నాడని రేవంత్ ఆరోపించారు. దీనిపై విచారణకు సిద్ధమా కేటీఆర్ అంటూ రేవంత్ నిలదీశారు. సింగరేణి నిధులు, కంట్రాక్టులపై కూడా దోపిడీ చేశాడని పేర్కొన్నారు. ఇవాళ మన మీటింగ్ ఉందని రేపు డ్రామారావును కూడా భూపాలపల్లి నియోజకవర్గానికి తెస్తున్నడని రేవంత్ గుర్తు చేశారు.
ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ(congress party)లో ఉన్నాడని గెలిపిస్తే అమ్మడు పోయాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో అమ్ముడు పోయిన సన్నాసులని ప్రజలను శిక్షించాలని రేవంత్ కోరారు. మరోవైపు గండ్ర వెంకట రమణా రెడ్డి సంపాదించుకున్న ఆస్తి మొత్తం కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నిన్ను ఎమ్మెల్యే, చీఫ్ విప్ ను చేసిందన్నారు. ఆ తర్వాత వందల కోట్ల రూపాయలకు అమ్ముడుపోయేందుకు కూడా కాంగ్రెస్ పార్టీనే కారణమని తెలిపారు. అలాంటి పార్టీ ఏం చేసిందని అనేందుకు రమణా రెడ్డికి సిగ్గుండాలని ఎద్దేవా చేశారు.
ఇంకోవైపు అధికార బీఆర్ఎస్(BRS) పార్టీ ప్రజలకు ఏం చేసిందని రేవంత్ రెడ్డి(revanth reddy) నిలదీశారు. ఏడాదికి లక్ష రూపాయల రుణ మాఫీ చేయకుండా 10 వేల రూపాయలు ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పించుకుంటుందని గుర్తు చేశారు. మరోవైపు డబుల్ బెడ్ రూం ఇళ్లు(double bedroom houses) కూడా అందరికీ అందడం లేదన్నారు. ఈ నియోజకవర్గంలో ఇంకా అనేక చోట్ల ఇందిరమ్మ ఇళ్లే కనిపిస్తున్నాయన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఎవరిని అడిగినా దుఖమే ఉందని పేర్కొన్నారు. మరోవైపు కేసీఆర్(kcr) కుటుంబం మాత్రం వేల కోట్ల రూపాయలు దోచుకుందని ఆరోపించారు. ఎక్కడ చూసినా వారి కుటుంబమే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.
భూపాలపల్లి నియోజకవర్గంలో 108 రూపంలో పని చేస్తున్న గంత్ర సత్తన్న(gandra satyanarayana rao)ను ఈసారి గెలిపించాలని కోరారు. ఈ క్రమంలో ప్రజా వ్యతిరేక పోయి…పేదల కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. భుపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని అభిప్రాయంవ్యక్తం చేశారు. నిన్నటిదాకా కాంగ్రెస్ లో ఉన్నోడు..ఇవాళ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఏం చేయలేదని మాట్లాడుతున్నడని గండ్ర వెంకట రమణా రెడ్డి(gandra venkataramana reddy) గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 500 రూపాయలకే వంట గ్యాస్ సిలండర్ ఇస్తుందని వెల్లడించారు. రైతులకు గిట్టుబాటు ధర సహా అనేక హామీలు నెరవేర్చుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.